: సోనియా తెల్లదొరసానిలా వ్యవహరిస్తోంది: ఎమ్మెల్యే మధుసూదన్ గుప్తా
కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ తెల్లదొరసానిలా వ్యవహరిస్తోందంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే మధుసూదన్ గుప్తా ధ్వజమెత్తారు. అనంతపురంలో ఆయన మాట్లాడుతూ, 'విభజించి పాలించు' సిద్ధాంతంతో రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసేందుకు సోనియా ముందుకు వెళ్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్ నాయకత్వం దేశాన్ని పాకిస్థాన్ కు అమ్మేందుకైనా వెనుకాడదని ఆయన విమర్శించారు. రాష్ట్రపతి కూడా 7 కోట్ల ప్రజల ఆకాంక్షలను పట్టించుకోలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.