: సీమాంధ్రుల న్యాయమైన కోరికలకు మా సహకారం ఉంటుంది: డీఎస్
విభజన నేపథ్యంలో సీమాంధ్ర ప్రజల న్యాయమైన కోరికలకు తమ సహకారం ఉంటుందని ఎమ్మెల్సీ డి.శ్రీనివాస్ చెప్పారు. సీమాంధ్రుల డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం పరిశీలించి తగిన న్యాయం చేస్తుందని భావిస్తున్నట్లు అభిప్రాయపడ్డారు. 'భవిష్యత్తులో పరస్పరం కలిసిమెలిసి ఉండే మనం.. స్నేహపూర్వకంగా విడిపోదాం' అని అన్నారు. తెలుగుజాతిని మరింత బలపర్చేలా అందరం వ్యవహరించాలని డీఎస్ పేర్కొన్నారు. కాగా, తెలంగాణ కోసం గతంలో హామీ ఇచ్చిన పార్టీలు సహకరించాలని కోరారు.