: ఎవరి పని వాళ్ళు కానిచ్చేశారు!


అది రాజస్థాన్ సీఎం వసుంధర రాజే కాన్వాయ్. జైపూర్ నుంచి భరత్ పూర్ వెళుతుండగా ఇంతలో ఆ వాహన శ్రేణి చివరన ఓ స్కార్పియో ప్రవేశించింది. భద్రత సిబ్బంది కూడా అది తమదే అని పొరబడ్డారు. ఇక అక్కడి నుంచి మొదైలంది కథ! సీఎం వెళుతుంటే రహదారిపై గ్రామాల వద్ద పార్టీ శ్రేణులు స్వాగతం పలకడం మామూలే కదా. భారీ జనసందోహం సర్వసాధారణం. ఇదే అదనుగా ఆ స్కార్పియోలోని ముగ్గురు జేబుదొంగలు తమ చేతివాటం ప్రదర్శించారు. అందినంత మేర జేబులు కత్తిరించి పారేశారు. చివరికి ఓ గ్రామం వద్ద స్థానికులు ముగ్గురు జేబుదొంగల్లో ఒకరిని పట్టుకున్నారు. ఇది చూసి మిగతా ఇద్దరూ పరారయ్యారు. దొరికిన దొంగ వద్ద రూ.14,000 నగదు లభించిందని, స్కార్పియోను సీజ్ చేశామని భరత్ పూర్ ఎస్పీ రాహుల్ ప్రకాశ్ తెలిపారు.

  • Loading...

More Telugu News