: కాంగ్రెస్ పార్టీకి రాంరాం చెబుతా..సీఎం కూడా వస్తారనుకుంటున్నా: టీజీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందితే కాంగ్రెస్ పార్టీకి రాంరాం చెబుతానని మంత్రి టీజీ వెంకటేష్ తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ.. రాజ్యసభలో తెలంగాణ బిల్లు ఆమోదం పొందితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడినట్టేనని స్పష్టం చేశారు. కేవలం తానే కాదని, పార్టీ నుంచి చాలామంది నేతలు బయటకు వచ్చేస్తారని టీజీ తెలిపారు. రాష్ట్ర విభజన బిల్లు ఆమోదం పొందిన రోజు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో చీకటి రోజని ఆయన అభిప్రాయపడ్డారు. సీఎం కిరణ్ కుమార్ రెడ్డి కూడా బయటకు వస్తారని తాను భావిస్తున్నానని ఆయన అన్నారు.