: నేనేం చేయాలో అదే చేస్తున్నా.. రాజకీయం కోసం చేయడం లేదు: కేజ్రీవాల్


తన ప్రభుత్వాన్ని తానే పడగొట్టుకోవాలని అనుకోవట్లేదని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, జనలోక్ పాల్ ఆమోదం కోసం తానేం చేయాలో అదే చేస్తున్నానన్నారు. జనలోక్ పాల్ బిల్లు అసెంబ్లీ ఆమోదం పొందకపోతే తాను రాజీనామా చేస్తానని హెచ్చరించారు. బిల్లుకు ఆమోదం తెలిపేందుకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖను కలవాలని కాంగ్రెస్ నేతలు చేస్తున్న సూచనలను ఆయన తిరస్కరించారు. తాను కేంద్ర హోం శాఖను కలిసే అవకాశం లేదని తెలిపారు. ముఖ్యమంత్రిగా రాజీనామా చేస్తే రాజకీయ మైలేజ్ పెరుగుతుందనే భావన తప్పని అన్నారు. తనకు మద్దతివ్వడం కాంగ్రెస్ పార్టీ ఇష్టమని, ఏ క్షణాన్నైనా తన ప్రభుత్వం పడిపోవచ్చని, దానికి తాను ఆందోళన చెందడం లేదని కేజ్రీ స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News