: బీసీసీఐ శ్రీనివాసన్ పై జీవితకాల నిషేధం విధించాలి: లలిత్ మోడీ


ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ వ్యవహారంలో బీసీసీఐ ఛైర్మన్ ఎన్.శ్రీనివాసన్ అల్లుడు, చెన్నై సూపర్ కింగ్స్ ప్రిన్సిపల్ గురునాథ్ మెయ్యప్పన్ దోషిగా నిర్ధారణ అయ్యాడని జస్టిస్ మకుల్ ముద్గల్ కమిటీ నివేదిక తెలిపింది. ఈ క్రమంలో ఇదే అదునుగా భావించిన మాజీ ఐపీఎల్ కమిషనర్ లలిత్ మోడీ, శ్రీనివాసన్ పై జీవితకాలం నిషేధం విధించాలని డిమాండ్ చేశాడు. ఈ మేరకు ట్విట్టర్లో మోడీ పలు వ్యాఖ్యలు చేశాడు. 'జస్టిస్ ముగ్దల్ నివేదిక చూసేందుకు చాలా సంతోషంగా ఉంది. నేను చెప్పిందే జరిగింది. ఐపీఎల్ తో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరిపై తప్పకుండా జీవితకాల నిషేధం విధించాలి' అని లలిత్ మోడీ ట్వీట్ చేశాడు.

  • Loading...

More Telugu News