: పాక్ క్రికెట్లో మరో మలుపు


అనిశ్చితికి మారుపేరైన పాకిస్తాన్ క్రికెట్లో మరో హఠాత్పరిణామం చోటు చేసుకుంది. పాక్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అధ్యక్షుడు జకా అష్రాఫ్ పదవి ఊడింది. సాక్షాత్తూ ప్రధాని నవాజ్ షరీఫ్ జోక్యం చేసుకుని జకాను అధ్యక్ష పదవి నుంచి తప్పించారు. పీసీబీ ప్యాట్రన్ ఇన్ చీఫ్ కూడా అయిన నవాజ్ షరీఫ్ తనకున్న విశిష్ట అధికారంతో జకాను ఇంటికి పంపారు. ఈ క్రమంలో పాక్ క్రికెట్ పాలన వ్యవహారాలు పర్యవేక్షించేందుకు 11 మందితో అడ్ హాక్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో పలువురు మాజీ క్రికెటర్లకు చోటు కల్పించారు. పాక్ క్రికెట్ ఆర్ధిక వ్యవహారాల్లో అవకతవకలు, అన్నింటికి మించి, ఇటీవల ఐసీసీ సమావేశాల్లో పీసీబీ అనుసరించిన తీరు విమర్శలపాలైంది. ఈ నేపథ్యంలో ప్రధాని నవాజ్ షరీఫ్ కొరడా ఝుళిపించినట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News