: రాష్ట్రపతికి కృతజ్ఞతలు.. అందరూ మద్దతివ్వండి: పొన్నాల
తెలంగాణ బిల్లును ఆమోదించిన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి కృతజ్ఞతలు అని మంత్రి పొన్నాల లక్ష్మయ్య అన్నారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలక ఘట్టం ముగిసిందని, ఇక మిగిలింది లాంఛనమేనని అన్నారు. పార్లమెంటులో తెలంగాణ బిల్లు సులభంగా ఆమోదం పొందుతుందని చెప్పారు. ఇక మిగిలింది జాతీయ పార్టీలు తమకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండడమేనని తెలిపారు. అన్ని పార్టీలు మద్దతిచ్చి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు.