: పోలీసులకు ఇన్ఫోసిస్ వితరణ
ప్రముఖ సాఫ్ట్ వేర్ సంస్థ ఇన్ఫోసిస్ పోలీసులకు విరాళమిచ్చింది. సైబరాబాద్ కమిషనర్ సీవి ఆనంద్ కు మూడు బొలేరో రక్షక్ వాహనాలను, పది ద్విచక్రవాహనాలను అందజేసింది. గస్తీ తిరగడానికి పోలీసులకు వాహనాలు సమకూర్చేందుకు సంస్థలు ముందుకు రావాలని చేసిన విజ్ఞప్తి మేరకు ఇన్ఫోసిస్ ఈ వాహనాలను సమకూర్చిందని, మరిన్ని సంస్థలు ముందుకొచ్చి వాహనాలు సమకూర్చాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఇన్ఫోసిస్ సంస్థ ప్రతినిధులు, సైబరాబాద్ పోలీసులు పాల్గొన్నారు.