: ఒక్క మాత్రతో నవయవ్వనం..!


ఇక వయసు మీదపడిపోతోందన్న దిగులు అక్కర్లేదంటున్నారు అమెరికన్ శాస్త్రవేత్తలు. తాము రూపొందిస్తున్న మాత్ర వార్ధక్యాన్ని నిలువరించి, నవయవ్వనాన్ని నింపుతుందని చెబుతున్నారు. సౌత్ ఫ్లోరిడా యూనివర్శిటీకి చెందిన పరిశోధకులు బ్లూ బెర్రీ పండ్లు, గ్రీన్ టీల సమ్మిళితంగా అద్భుత గుళికను తయారు చేశారట. దీంట్లో శక్తిమంతమైన యాంటీ ఆక్సిడాంట్లు, విటమిన్ డి 3, అమైనో యాసిడ్లు ఉంటాయని వివరించారు. ఒక్క మాత్ర వేసుకుంటే మనిషి మెదడు పనితీరును మెరుగుపర్చి, తద్వారా మనిషిని శక్తిమంతం చేస్తుందట. 65-85 ఏజ్ గ్రూప్ వాళ్ళను ఎంపిక చేసి వారిపై కొన్ని పరీక్షలు నిర్వహించగా.. ఈ మాత్ర స్వీకరించిన వారిలో ఆలోచనా తీరు, మాటల్లో స్పష్టత, జ్ఞాపకశక్తి మెరుగయ్యాయని పరిశోధకులు తెలిపారు. రీజువెనేషన్ రీసెర్చ్ అనే జర్నల్లో ఈ వివరాలను ప్రచురించారు.

  • Loading...

More Telugu News