: సరిదిద్దాల్సిన రాష్ట్రపతి అన్యాయం చేశారు: పయ్యావుల
దేశంలో రాజకీయ పార్టీలు తప్పు చేస్తే సర్ది చెప్పాల్సిన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ స్థాయికి తగ్గట్టు వ్యవహరించలేదని టీడీపీ నేత పయ్యావుల కేశవ్ అభిప్రాయపడ్డారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, రాజకీయ పార్టీలు తప్పటడుగులు వేస్తే బెత్తంతో చరిచినట్టు బుద్ధి చెప్పాల్సిన రాష్ట్రపతి.. అసెంబ్లీ వ్యతిరేకించినా, మెజారిటీ ప్రజలు వ్యతిరేకిస్తున్నా బిల్లును ఆమోదించడం సరైన చర్య కాదన్నారు. సీమాంధ్ర ప్రజలంటే కాంగ్రెస్ అధిష్ఠానానికి చులకనభావం ఉందని పయ్యావుల మండిపడ్డారు.