: అమెరికా ధర్మదాతగా ఫేస్ బుక్ అధినేత


ఫేస్ బుక్ అధినేత మార్క్ జుకెర్ బర్గ్, భార్య ప్రిసిల్లా చాన్ లు అమెరికా అత్యున్నత ధర్మదాతలుగా ఎంపికయ్యారు. ఈ ఏడాది డిసెంబర్ లో 18 మిలియన్ల (970 మిలియన్ డాలర్లుపైన) ఫేస్ బుక్ షేర్లను సిలికాన్ వ్యాలీ అనే స్వచ్ఛంద సంస్థకు విరాళంగా ఇచ్చి జుకెర్ తన దాతృత్వాన్ని చాటుకున్నాడని 'ద క్రానికల్ ఆఫ్ ఫిలాంత్రొపీ' పేర్కొంది. అందుకే అతనిని 2013 బడా ధర్మదాతగా ఎంపిక చేసినట్లు తెలిపింది. జుకెర్ ఇచ్చిన విరాళం ఈ ఏడాదిలో అతిపెద్ద స్వచ్ఛంద విరాళంగా ప్రజా రికార్డు నెలకొల్పిందని పత్రిక వివరించింది. ఈ క్రమంలో 50 మంది అమెరికన్ దాతల జాబితాలో జుకెర్ బెర్గ్, చాన్ లను తొలి స్థానంలో పేర్కొన్నట్లు తెలిపింది.

  • Loading...

More Telugu News