: విభజన బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం.. రేపు రాజ్యసభలో ప్రవేశపెట్టనున్న కేంద్రం
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్ధీకరణ బిల్లుకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదం తెలిపారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం రేపు రాజ్యసభలో మధ్యాహ్నం 12 గంటల తర్వాత బిల్లును ప్రవేశపెట్టనుంది. ఈ క్రమంలో సభలో బిల్లు పాస్ అయ్యేందుకు సహకరించాలంటూ పార్లమెంటు వ్యవహారాల మంత్రి కమల్ నాథ్ బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీతో చర్చలు జరుపుతున్నారు.