: పంచాయతీ కార్యదర్శుల పోస్టులకు వెల్లువెత్తిన దరఖాస్తులు


లక్షలాది మంది నిరుద్యోగులు వరుసగా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారు. ఇటీవల జరిగిన వీఆర్వో, వీఆర్ఏ పరీక్షల్లో లక్షలాది మంది ఉద్యోగార్థులు తమ భవితవ్యాన్ని పరీక్షించుకున్నారు. ఇక, ఇప్పుడు.. పంచాయతీ కార్యదర్శుల పరీక్ష నిర్వహించేందుకు ఏపీపీఎస్పీ ఏర్పాట్లు చేస్తుండగా.. ఈ పోస్టులకు కూడా తీవ్రమైన పోటీ నెలకొంది. ఈ పరీక్షలకు ఇప్పటికే దరఖాస్తులు వెల్లువెత్తాయి. ఒక్కో పోస్టుకు సగటున 657 మంది పోటీ పడుతున్నారు. పరీక్షల్లో అభ్యర్థులు సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా పోస్టులను నేరుగా భర్తీ చేస్తారు.

పంచాయతీ కార్యదర్శుల పోస్టుల ప్రవేశ పరీక్షకు కనీస విద్యార్హత డిగ్రీ ఉండాలనే నిబంధన ఉన్న విషయం విదితమే. రాష్ట్రవ్యాప్తంగా 2,677 పంచాయతీ కార్యదర్శుల నియామకానికి గత ఏడాది డిసెంబరు 30న ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. జనవరి 26వ తేదీన దరఖాస్తులకు గడువు ముగిసింది. రిజర్వేషన్లకు అనుగుణంగా జిల్లాల వారీగా ఖాళీల వివరాలను ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ లో పొందుపరిచింది.

  • Loading...

More Telugu News