: అలహాబాద్ వర్శిటీ ఫీజు కౌంటర్ వద్ద బాంబు విసిరిన ఆగంతుకుడు
ఉత్తరప్రదేశ్ లోని అలహాబాద్ యూనివర్శిటీలో నేడు బాంబు పేలుడు సంభవించింది. గుర్తు తెలియని వ్యక్తి ఒకరు వర్శిటీ ప్రాంగణంలోని ఫీజు కౌంటర్ వద్ద బాంబును విసిరారు. విస్ఫోటనం నుంచి విద్యార్థులు గాయపడకుండా తప్పించుకోగలిగారు. పోలీసులు ఈ విషయమై దర్యాప్తు ప్రారంభించారు. సంఘ వ్యతిరేక శక్తుల కోణంలోనూ దర్యాప్తు చేయనున్నారు.