: తెలంగాణ బిల్లు తప్పక ఆమోదం పొందుతుంది: విద్యాసాగరరావు
పార్లమెంటులో తెలంగాణ ముసాయిదా బిల్లు తప్పక ఆమోదం పొందుతుందని బీజేపీ సీనియర్ నేత విద్యాసాగరరావు అన్నారు. సోమవారం ఉదయం ఆయన మీడియాతో మాట్లాడారు. బిల్లును అడ్డుకుంటామని వెంకయ్య నాయుడు చెప్పలేదని, బీజేపీపై ఎలాంటి అనుమానాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదని ఆయన చెప్పారు.