: యాసిడ్ దాడుల విషయంలో ప్రభుత్వాలపై సుప్రీం ఆగ్రహం
యాసిడ్ దాడుల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న వైఖరిపై సుప్రీంకోర్టు ఈ రోజు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వీటి నిరోధానికి నిర్మాణాత్మక చర్యలు చేపట్టాలని కోరింది. యాసిడ్ దాడి కేసుల్లో బాధితులకు పరిహారం పెంచాలని ఆదేశించింది. యాసిడ్ విక్రయాలను నిషేధించడం, యాసిడ్ దాడి బాధితులకు పునరావాసం, పరిహారం పెంపుపై చర్చించాలని కోరింది. ఇందుకోసం అన్ని రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులు, కేంద్ర హోం శాఖ కార్యదర్శితో సమావేశం ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్నిఆదేశించింది.
యాసిడ్ దాడి కేసును ప్రత్యేకంగా పరిగణించి బాధితుల చికిత్సకు అయ్యే ఖర్చును రాష్ట్ర ప్రభుత్వాలే భరించాలని కోరుతూ ఒక స్వచ్చంద సంస్థ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వాజ్యంపై విచారణ సందర్భంగా కోర్టు ఈ ఆదేశాలు వెలువరించింది. అయితే ఈ విషయంలో ఇప్పటికే చట్టం రూపొందించామని, బాధితుల పునరావాసానికి చర్యలు తీసుకున్నామని కేంద్ర ప్రభుత్వం వినిపించిన వాదనకు కోర్టు సంతృప్తి చెందలేదు.