: ఉలిక్కిపడిన ఆస్ట్రేలియా
ఆస్ట్రేలియా దీవి ఉలిక్కిపడింది. కార్చిచ్చు చెలరేగడంతో ప్రజలు భయం గుప్పిట్లో కాలం గడుపుతున్నారు. విక్టోరియా రాష్ట్రంలో మెల్ బోర్న్ సహా పలు చోట్ల అటవీ ప్రాంతాల్లో మంటలు చెలరేగాయి. 20 ఇళ్ళు పూర్తిగా దగ్ధమయ్యాయి. అధికారులు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఆస్ట్రేలియాలో ప్రస్తుతం వేసవి కారణంగా వేడిగాలులు వీస్తున్నాయి. వీటి కారణంగానే కార్చిచ్చు చెలరేగి ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా, 2009లో సంభవించిన కార్చిచ్చు కారణంగా 179 మరణించడాన్ని ఆస్ట్రేలియా ప్రజలు ఇంకా మర్చిపోలేదు. ఈ నేపథ్యంలో ఈసారి పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్టు విక్టోరియా రాష్ట్ర వర్గాలు తెలిపాయి.