: భార్య స్కూటీ కొన్నదని యాసిడ్ పోశాడు.. తానూ తాగేశాడు


తనను లక్ష్యపెట్టలేదన్న కోపంతో ఓ కసాయి భర్త ఎంతటి దురాగతానికి ఒడిగట్టాడో చూడండి. ఆమెపై యాసిడ్ పోయడమే గాకుండా, తనూ తాగేశాడు. క్రైమ్ రేట్ ఎక్కువగా నమోదయ్యే ఉత్తరప్రదేశ్ లో జరిగిందీ ఘటన. లక్నో సమీపంలోని మనేరా రాణియాపూర్ గ్రామానికి చెందిన శుక్లా (40) అనే వ్యక్తి బట్టల వ్యాపారం చేస్తుంటాడు. అతని భార్య దీపమాల (35) ఓ స్కూల్లో పనిచేస్తోంది. స్కూల్ కు వెళ్ళివచ్చేందుకని ఆమె తన భర్తకు తెలియకుండా ఓ స్కూటీ కొనుగోలు చేసింది. తనకు చెప్పకుండా భార్య స్కూటీ కొనడంపై శుక్లా గుర్రుగా ఉన్నాడు. ఉదయాన్నే దీపమాల భర్తకు టీ ఇచ్చేందుకని వెళ్ళగా, శుక్లా అప్పటికే సిద్ధంగా ఉంచుకున్న యాసిడ్ ను ఆమెపై చిమ్మాడు. అనంతరం తానూ యాసిడ్ తాగాడు. హఠాత్తుగా అరుపులు విన్న వారి బంధువులు వారిద్దరినీ ఆసుపత్రికి తరలించారు. దీపమాలకు 60 శాతం కాలిన గాయాలు కాగా, ఆమె భర్త శుక్లా పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు.

  • Loading...

More Telugu News