: టీడీపీ ఎంపీల పుస్తకంపై పార్లమెంటు సెంట్రల్ హాలులో చర్చ


టీడీపీ ఎంపీలు ప్రచురించిన 30 పేజీల పుస్తకంపై పార్లమెంటు సెంట్రల్ హాల్ లో అన్ని పార్టీల ఎంపీలు చర్చిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన బిల్లులోని లోపాలను ప్రస్తావిస్తూ, సవరణలతో కూడిన 35 పేజీల పుస్తకాన్ని టీడీపీ ఎంపీలు ప్రచురించారు. ఆ పుస్తకాన్ని అన్ని పార్టీల ఎంపీలకు అందజేశారు. రాష్ట్ర విభజనలో కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న విధానాలను ఇందులో తీవ్రంగా వ్యతిరేకించారు. రేపు పార్లమెంటులో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టనున్నారన్న సమాచారంతో దీనిపై ఎంపీలంతా చర్చిస్తున్నారు.

  • Loading...

More Telugu News