: 'కామా'కి ఇక ఫుల్ స్టాపేనా?
భాష మాట్లాడడంలో సరళత్వమే కాదు.. రాయడంలోనూ అది కనిపిస్తోంది. కొన్ని పదాల్లో అక్షరాలను తగ్గించేయడాన్ని మనం గమనిస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఆ పరిస్థితి విరామ చిహ్నాలకు కూడా వచ్చినట్లు కనిపిస్తోంది. ఏదైనా రాస్తున్నప్పుడు.. వాక్యాల్లో పుల్ స్టాప్, కామా, కోట్స్ వంటి వాటికి ఎంతో ప్రాముఖ్యం ఉంది. అయితే, కామా వాడకపోయినా ఏం కాదని, అర్థంలో ఎలాంటి మార్పు ఉండదని అంటున్నారు అమెరికాలోని కొలంబియా వర్సిటీ ప్రొపెసర్ జాన్ మెక్ వోర్టర్. ఇటీవలి కాలంలో రచనల్లో కామా తగ్గిందని ఆయన చెబుతున్నారు. దీంతో ఆంగ్ల భాష నుంచి కామా కనుమరుగయ్యే రోజులు దగ్గరపడినట్లు కనిపిస్తోంది. ఇప్పటికే కోట్స్ వాడకం కూడా తగ్గిన విషయం తెలిసిందే!