: రాష్ట్రపతి నుంచి బిల్లు అందాల్సి ఉంది: షిండే
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన బిల్లు తనకు అందాల్సి ఉందని కేంద్ర హోం శాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే తెలిపారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, బిల్లు పార్లమెంటులో ఎప్పుడు ప్రవేశపెట్టాలో తెలుసని, అయితే ఆ క్షణాల గురించి బయటకు చెప్పడం తనకు ఇష్టం లేదని అన్నారు. బిల్లును ఎలా ఆమోదింపజేయాలో కూడా తమకు తెలుసని, తమ వద్ద అందుకు స్పష్టమైన ప్రణాళిక ఉందని ఆయన తెలిపారు.