: బ్రిటిషర్ల వాసనలు ఇంకా కొనసాగుతున్నాయి: పయ్యావుల


బ్రిటిష్ కాలం నాటి విభజించు, పాలించు వాసనలు పార్లమెంటు, రాష్ట్రపతి భవన్ లలో కొనసాగుతున్నాయని టీడీపీ నేత పయ్యావుల కేశవ్ ఆరోపించారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రపతి సంతకం లేకుండానే అఖిలపక్షం సమావేశంలో బిల్లు ప్రతులు పెడితే రాష్ట్రపతి ఎందుకు జోక్యం చేసుకోలేదని ప్రశ్నించారు. తమ ప్రాంత ప్రజల కష్టాలు పట్టించుకోనప్పుడు ఏం చేసేందుకైనా తాము వెనుకాడమని ఆయన ప్రకటించారు.

  • Loading...

More Telugu News