: పార్లమెంటులో తెలంగాణ బిల్లు రేపే
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన బిల్లు రేపే పార్లమెంటు ముందుకు రానుందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి సత్యబ్రత చతుర్వేది తెలిపారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తెలంగాణ బిల్లు పార్లమెంటు ఉభయ సభల్లో ప్రవేశపెట్టేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అన్నారు. అందువల్ల రేపు పార్లమెంటు సమావేశంలోనే తెలంగాణ బిల్లు ప్రవేశపెడతామని ఆయన తెలిపారు.