: సుఖ సంసారానికి రహస్యాలేవీ ఉండవు: అజయ్ దేవ్ గణ్


వైవాహిక జీవితం సుఖంగా సాగిపోయేందుకు పెద్దగా రహస్యాలేవీ ఉండవంటున్నాడు బాలీవుడ్ స్టార్ అజయ్ దేవ్ గణ్. సహనటి కాజోల్ ను పదిహేనేళ్ళ క్రితం 1999లో పరిణయమాడిన ఈ యాక్షన్ హీరో ఏమంటున్నాడో వినండి. 'మనం సంతోషంగా ఉండాలి, మన జీవిత భాగస్వామిని సంతోషంగా ఉంచాలి.. ఆనందమయ దాంపత్యానికి ఇంతకుమించి రహస్యమేముంటుంది? ' అని సూత్రీకరించాడు. సినీ పరిశ్రమలో అయినా, ఇంకెక్కడైనా ఇదే సూత్రం వర్తిస్తుందని సెలవిచ్చాడు. పెళ్ళి పట్ల కమిట్ మెంట్ తోపాటు భాగస్వామికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇస్తే సమస్యలేవీ ఉండవని పేర్కొన్నాడీ 'సన్నాఫ్ సర్దార్' స్టార్. ప్రస్తుతం అజయ్.. ప్రభుదేవా 'యాక్షన్ జాక్సన్' లోనూ, రోహిత్ శెట్టి 'సింగం-2'లోనూ నటిస్తున్నాడు.

  • Loading...

More Telugu News