: చంద్రుడిపై తవ్వకాలకు వీరిని సంప్రదించండి
అమెరికా ఖగోళ పరిశోధన సంస్థ నాసా సరికొత్త ప్రతిపాదన చేస్తోంది. చంద్రుడిపై తవ్వకాలను నిర్వహించాలనుకుంటే తమను సంప్రదించవచ్చని నాసా పేర్కొంది. ఈ మేరకు దరఖాస్తులకు ఆహ్వానం పలికింది. హీలియం-3 వాయువుతోపాటు, కొన్ని అరుదైన ఖనిజాలు అన్వేషించే ప్రాజెక్టులో భాగంగా నాసా ఈ నిర్ణయం తీసుకుంది. ఇందుకు అమెరికా ప్రభుత్వం నుంచి నిధులేమీ అందకపోయినా, నాసా నుంచి మాత్రం సహకారం లభిస్తుంది. దరఖాస్తులను వడపోసి కాంట్రాక్టు దక్కించుకున్న కంపెనీ పేరును వెల్లడిస్తారు. అయితే, ప్రాజెక్టు కేటాయింపు ఎప్పుడనేది నాసా ప్రకటించలేదు.