: పేస్ బౌలింగు సంక్షోభంలో పాక్: వసీం అక్రమ్
దిగ్గజ పేస్ బౌలర్ వసీం అక్రమ్ పాకిస్థాన్ క్రికెట్ బోర్డు విభాగంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలనుకుంటున్నాడు. ఇందులో భాగంగా బోర్డులో అక్రమ్ తనదైన పాత్ర పోషించాలని భావిస్తున్నాడు. ముఖ్యంగా సంక్షోభంలో ఉన్న ఫాస్ట్ బౌలింగ్ విభాగానికి తన సహాయ సహకారాలను అందించాలనుకుంటున్నట్లు తెలిపా
దీనిపై మరింత వివరంగా మాట్లాడిన వసీం.. 'ప్రపంచ క్రికెట్ లో పాక్ ను మొదటిస్థానంలో చూడాలనుకుంటున్నాను. ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్ లో పాక్ ఆటగాళ్ల ప్రదర్శన నన్ను బాగా నిరాశపరిచింది. అందుకే, ఉత్తేజకరమైన పేస్ ఆటగాళ్లను వెలుగులోకి తేవాలని వుంది' అని పేర్కొన్నాడు. పేస్ బౌలింగులో పాక్ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటోందంటూ వారం రోజుల కిందట ఆ దేశ క్రికెట్ చీఫ్ సెలక్టర్ ఇక్బాల్ ఖాసిం హెచ్చరించాడు. ఈ నేపథ్యంలో అక్రమ్ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
- Loading...
More Telugu News
- Loading...