: గవర్నర్ తో సీఎం భేటీ
రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ తో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యారు. రాష్ట్ర విభజన బిల్లును రేపు పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారన్న ఊహాగానాల నడుమ, ముఖ్యమంత్రి రాజీనామా చేస్తారంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో వీరి భేటీ ప్రధాన్యత సంతరించుకుంది. కాగా, వీరి మధ్య చర్చకు వచ్చిన అంశాలపై మరింత సమాచారం అందాల్సి ఉంది.