: సీబీఐ డాక్యుమెంటరీకి గొంతు అరువివ్వనున్న బిగ్ బి
బాలీవుడ్ నట దిగ్గజం అమితాబ్ బచ్చన్ కంఠస్వరం గంభీరంగా ఉంటుందన్న సంగతి తెలిసిందే. పలు సినిమాల్లో ఆయన చెప్పిన సీరియస్ డైలాగులు ఇప్పటికీ అభిమానుల చెవుల్లో మార్మోగుతుంటాయి. ఈ పొడగరి యాంగ్రీ యంగ్ మాన్ ఇమేజి సొంతం చేసుకోవడంలో ఆయన గొంతుదీ కీలకపాత్రే. తాజాగా, ఆయన వాయిస్ ను వినిగియోగించుకోవాలని సీబీఐ భావిస్తోంది. కేంద్ర దర్యాప్తు సంస్థ 50 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా సిల్వర్ జూబ్లీ వేడుకలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ క్రమంలో సీబీఐ సుదీర్ఘ ప్రస్థానంపై ఓ డాక్యుమెంటరీ నిర్వహించనున్నారు. దానికి అమితాబ్ తన గొంతు అరువివ్వనున్నారు. ఈ చిత్రం ద్వారా సీబీఐ గురించి ఇప్పటివరకు వెల్లడికాని కొన్ని విషయాలు తెలుసుకోవచ్చని అమితాబ్ తెలిపారు. కాగా, అమితాబ్ ఈ డాక్యుమెంటరీ హిందీ వెర్షన్ కు వాయిస్ ఓవర్ చెబుతుండగా, ఇంగ్లిష్ వెర్షన్ బాధ్యతలను మరో సీనియర్ నటుడు కబీర్ బేడీకి అప్పగించారు.