: లైంగిక వేధింపుల మాజీ మంత్రి అరెస్టుకు గ్రీన్ సిగ్నల్
ప్రభుత్వ వైద్యురాలిపై అత్యాచారం చేయబోయిన జమ్మూ కాశ్మీర్ మాజీ మంత్రి షబీర్ ఖాన్ అరెస్టుకు అడ్డంకులు తొలగిపోయాయి. తన కార్యాలయానికి వచ్చిన వైద్యురాలికి మత్తుమందు కలిపిన టీ ఇచ్చి మంత్రి అత్యాచారం చేయబోగా.. ఆమె తప్పించుకుని బయటపడింది. అనంతరం వచ్చిన విమర్శలతో మంత్రి రాజీనామా చేశారు. ఇప్పుడు ఆయన అరెస్టుకు జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ స్పీకర్ అనుమతించారు.