: ధర్డ్ ఫ్రంట్ పై లెఫ్ట్ నేతల భేటీ.. త్వరలో అధికారిక సమావేశం
ఇప్పటివరకు ఊహాగానాలకే పరిమితమైన ధర్డ్ ఫ్రంట్ అంశం ఇప్పుడు భేటీల దాకా వచ్చింది. ఈ మేరకు జనతా దళ్ అధినేత దేవెగౌడ నివాసంలో సీపీఎం, సీపీఐ, జేడీయూ నేతలు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కూడా పాల్గొన్నారు. దేశంలో కాంగ్రెస్, బీజేపీయేతర ప్రభుత్వం ఏర్పాటుచేసే దిశగా మంతనాలు జరుగుతున్నాయి. అయితే, మామూలుగానే తాము కలిశామని, ఇదేమీ అధికారిక భేటీ కాదని నీతీష్ తెలిపారు. త్వరలోనే అధికారిక సమావేశం నిర్వహిస్తామని ఆయన చెప్పారు. పార్లమెంటు ముగిసిన తర్వాత పదకొండు పార్టీలు సమావేశమై.. మూడో ఫ్రంట్ పై చర్చిస్తామని దేవెగౌడ వెల్లడించారు.