: పెరోల్ గడువు పెంపుకు మూడోసారి సంజయ్ దత్ విజ్ఞప్తి
పెరోల్ గడువు పెంచాలంటూ నటుడు సంజయ్ దత్ కోరినట్లు పూణెలోని ఎరవాడ జైలు అధికారులు తెలిపారు. భార్య మాన్యతకు తీవ్ర అనారోగ్యం కారణంగా ఇప్పటికే రెండుసార్లు పెరోల్ (60 రోజులు)పై సంజయ్ బయట ఉంటున్న సంగతి తెలిసిందే. అయితే, ఇటీవలే అతని భార్య ముంబయిలోని గ్లోబల్ ఆసుపత్రిలో పూర్తి పరీక్షలు చేయించుకోవటం, ఆమెకు ఆపరేషన్ అవడం కూడా జరిగిపోయాయి. దాంతో, ఆమె కోలుకునేందుకు రెండు నెలల దాకా విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. ఈ క్రమంలో రెండు రోజుల కిందట మాన్యత డిశ్చార్జ్ అయ్యారు. ఈ నేపథ్యంలో తన భార్య, పిల్లలను సంజయ్ చూసుకోవాల్సి ఉంది. అటు ఈ నెల 21న పెరోల్ గడువు ముగుస్తుండటంతో మరో 30 రోజుల పాటు అనుమతినివ్వాలని సంజూ అప్లికేషన్ పెట్టుకున్నాడట.