: ఏపీ భవన్ లో టీ జేఏసీ నేతల ఆందోళన


ఢిల్లీలోని ఏపీ భవన్లో తెలంగాణ జేఏసీ నేతల ఆందోళన కొనసాగుతూనే ఉంది. తెలంగాణ బిల్లును పార్లమెంట్ లో ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ గత రెండు రోజుల నుంచీ నిరసన వ్యక్తం చేస్తున్నారు. సంపూర్ణ తెలంగాణ ఇవ్వాలంటూ ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేస్తున్నారు. బిల్లును పార్లమెంట్ లో పాస్ చేయించేందుకు బీజేపీ సహా ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో టీజేఏసీ కన్వీనర్ కోదండరాం, ఉద్యోగ సంఘాల నేత శ్రీనివాస్ గౌడ్ ఇతరులు పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News