: పార్లమెంటు సభ్యులు తమ బాధ్యతను గుర్తుంచుకోవాలి: ప్రణబ్
పార్లమెంటు సభ్యులు తమ బాధ్యతను గుర్తెరిగి మసలుకోవాలని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సూచించారు. పార్లమెంటు ఉన్నది చర్చించి నిర్ణయాలు తీసుకునేందుకేనని ఆయన గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ సహా పలు కీలక బిల్లులు సభ ముందుకు వచ్చే అవకాశాలు ఉండడం.. మరోవైపు విభజనను వ్యతిరేకిస్తూ సీమాంధ్ర ఎంపీలు పార్లమెంటులో నిరసన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో రాష్ట్రపతి ఇలా సూచించడం ప్రాధాన్యం సంతరించుకుంది.