: టీ కాంగ్రెస్ ఎంపీలూ... మీకిదే సరైన సమయం: హరీష్ రావు
తెలంగాణ సాధించుకోవటానికి ఇదే సరైన సమయమని టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోండని ఆయన తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ ఎంపీలకు సలహా ఇచ్చారు. ఓ పక్క పొరుగుదేశంలో తమిళులకు అన్యాయం జరిగిందని డీఎంకే కేంద్రం నుండి బయటకు వచ్చిందని, సొంత ప్రాంతంలో ఎంతో మంది బలవుతోన్నా టీ కాంగ్రెస్ ఎంపీలు ఎందుకు పట్టించుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు. గతంలో చేసిన రాజీనామాలు డ్రామా అని తెలంగాణ ప్రజలు భావించకుండా ఉండాలంటే, కేంద్రం మీద ఒత్తిడి తెచ్చేందుకు ఇదే సరైన సమయమని హరీష్ రావు పేర్కొన్నారు.