: ముగిసిన రాష్ట్ర కేబినెట్ భేటీ.. టీ మంత్రుల డుమ్మా


శాసనసభ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్న ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇందుకోసం కొద్ది సేపటి క్రితమే కేబినెట్ సమావేశం జరిగింది. విభజన విషయంలో సీఎం వ్యవహార శైలితో విసిగిపోయిన తెలంగాణ ప్రాంత మంత్రులు కేబినెట్ సమావేశానికి గైర్హాజరయ్యారు. కేబినెట్ ఆమోదం తెలిపిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను రాష్ట్ర ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణరెడ్డి శాసనసభలో ప్రవేశపెడతారు. రాష్ట్ర ప్రభుత్వ పదవీకాలం ముగిసే ఏడాది మొదటి ఆరు నెలల కాలానికి సంబంధించిన ఆదాయ, వ్యయాలతో కూడిన తాత్కాలిక బడ్జెట్ ను ఓటాన్ అకౌంట్ గా పేర్కొంటారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పూర్తి స్థాయి బడ్జెట్ ను అప్పటి సమావేశాల్లో ప్రవేశపెడతారు.

  • Loading...

More Telugu News