: అవసరమైతే వందసార్లు సీఎం పదవిని త్యాగం చేస్తా: కేజ్రీవాల్


జన్ లోక్ పాల్ బిల్లు పాస్ అవకుంటే ఢిల్లీ ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలగుతానని కేజ్రీవాల్ ప్రకటించారు. బిల్లుకు కాంగ్రెస్ కూడా మద్దతిచ్చే అవకాశాలు కనిపించకపోవడంతో ఆయనిలా హెచ్చరిక స్వరం వినిపించారు. అవినీతిని రూపుమాపే లోక్ పాల్ చట్టాన్ని తీసుకురాలేనప్పుడు తనకు సీఎం పదవిలో ఉండే హక్కు లేదన్నారు. దేశం నుంచి అవినీతిని నిర్మూలించడం కోసం అవసరమైతే వందసార్లు సీఎం పదవిని త్యాగం చేస్తానని కేజ్రీవాల్ చెప్పారు. జన్ లోక్ పాల్ బిల్లుకు ఢిల్లీ కేబినెట్ కొన్ని రోజుల క్రితం ఆమోదం తెలుపగా.. దాన్ని సభలో పెట్టి ఆమోదం పొందాల్సి ఉంది.

కేజ్రీవాల్ రాజీనామా బెదిరింపులపై అన్నాహజారే బృంద సభ్యురాలు కిరణ్ బేడీ విమర్శలకు దిగారు. ఇతరులను నిందించడానికి లోక్ పాల్ బిల్లును రూపొందించారా? లేక సభామోదం పొందాలనే ఉద్దేశంతో రూపొందించారా? అని ప్రశ్నించారు. ఈ మేరకు ఆమె ట్విట్టర్లో ట్వీట్ చేశారు. కేజ్రీవాల్ ఇప్పుడు అన్నాహజారే మద్దతు కోరుతున్నారని, ఢిల్లీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు మాత్రం ఆయనను మర్చిపోయారని విమర్శించారు.

  • Loading...

More Telugu News