: రాష్ట్ర విభజనతో దేశం అల్లకల్లోలం అవుతుందని రాష్ట్రపతి ఎన్నోసార్లు బాధపడ్డారు: టీజీ వెంకటేష్
రాష్ట్ర విభజన జరిగితే దేశం అల్లకల్లోలం అవుతుందని రాష్ట్రపతి ఎన్నోసార్లు బాధపడ్డారని మంత్రి టీజీ వెంకటేష్ తెలిపారు. అందువల్ల ఆయన తన ఆత్మసాక్షి మేరకు నిర్ణయం తీసుకోవాలని కోరారు. సీమాంధ్రకు న్యాయం చేయాలంటున్న బీజేపీ తన మాటకు కట్టుబడి ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఈ రోజు ఆయన కర్నూలులో మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.