: పోలీసు అధికారిపై దాడిచేసిన మహారాష్ట్ర ఎమ్మెల్యేలపై ఎఫ్ఐఆర్


రోడ్డుపై వేగంతో వెళ్తున్నందుకు గానూ జరిమానా విధించాడన్న ఆగ్రహంతో పోలీసు అధికారిపై పిడిగుద్దులతో మహారాష్ట్ర అసెంబ్లీ ఎదుటే దాడి చేసిన వాసై ఎమ్మెల్యే క్షితిజ ఠాకూర్, ఎమ్ఎన్ఎస్ శాసనసభ్యుడు రామ్ కదమ్, మరో 14 మందిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. బాధిత అసిస్టెంట్ పోలీసు అధికారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు, నేతలకు వ్యతిరేకంగా ఇక్కడి మెరైన్ డ్రైవ్ పోలీసు స్టేషన్ లో కేసు నమోదు చేసినట్లు ఓ పోలీసు అధికారి తెలిపారు.

ఇందులో పలు
 ఆరోపణలతో ఐపిసీ సెక్షన్లు 143 (అశాస్త్రీయ అసెంబ్లీ), 341 (అణచివేయుట), 353 (దాడి), 504 (రెచ్చగొట్టే ఉద్దేశంతో కావాలని అవమానించడం), 323 (ఉద్దేశపూర్వకంగా బాధించి శిక్షించుట), 506 (2) (నేర బెదిరింపులు) కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అయితే కేసులో మిగతా వ్యక్తుల పేర్లు అందుబాటులో లేవన్నారు. కేసు దర్యాప్తును నేర పరిశోధక శాఖకు అప్పగించామని చెప్పారు.

కేసు పూర్వాపరాలలోకి వెళితే, ముంబయ్ లో మంగళవారం బాంద్ర-వర్లి రోడ్డుపై ఎమ్మెల్యే క్షితిజ ఠాకూర్ తన కారులో వేగంతో వెళ్లున్నారు. ఆ సమయంలో అటువైపు విధులు నిర్వహిస్తున్న వర్లి పోలీసు అధికారి సచిన్ సూర్యవంశి వారిని ఆపి, జరిమానా విధించాడు. దీంతో కోపోద్రిక్తుడైన ఎమ్మెల్యే ఠాకూర్ అసెంబ్లీలో పోలీసు అధికారికి వ్యతిరేకంగా సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇచ్చారు. అతనిని విధుల నుంచి తొలగించాలని మిగతా పార్టీల ఎమ్మెల్యేలు కూడా డిమాండు చేశారు.

తర్వాత అసెంబ్లీ బయట తారసపడిన 
సూర్యవంశిపై సదరు ఎమ్మెల్యేతో పాటు ఎంఎన్ఎస్, శివసేన, బీజేపీ శాసనసభ్యులు, స్వతంత్ర ఎమ్మెల్యేలు సైతం ఒక్కసారిగా దాడికి పాల్పడ్డారు. దాంతో పోలీసు అధికారికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.                                 

  • Loading...

More Telugu News