: సీఎం రాజీనామా చేయరు: మంత్రి డొక్కా
సీఎం కిరణ్ రాజీనామా చేయరని... చేయాలని కూడా ఎవరూ అడగరని మంత్రి డొక్కా మాణిక్య ప్రసాద్ స్పష్టం చేశారు. కిరణ్ ను ఇంతకాలం ముఖ్యమంత్రి పదవిలో ఉంచినందుకు సోనియాగాంధీకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని చెప్పారు. రానున్న ఎన్నికల్లో ఆయనే తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాల్లో పర్యటించి కాంగ్రెస్ ను గెలిపిస్తారని తెలిపారు.