: ఆకాశంలోంచి జారి పడ్డారు... అయినా బతికారు!


ఆయుష్సు తీరకుంటే ఆకాశంలోంచి ఊడిపడ్డా నిక్షేపంలా లేచి నడిచి వెళ్లిపోతారు. ఇలాంటిదే ఒక సంఘటన జరిగింది. అమెరికాకు చెందిన ఇద్దరు ఆకాశంలో ఎనిమిది వేల అడుగుల ఎత్తు నుంచి వచ్చి తియ్యటి ద్రాక్ష తోటలో పడ్డారు.

క్రెయిగ్, కేట్ హాన్సన్ ఇద్దరూ నార్త్ కేలిఫోర్నియా వాసులు. ప్యారాచూట్ సాహసికులు. ఆకాశంలోంచి అమెరికా జెండాను ఎగురవేస్తూ కిందికి దిగాలనే విన్యాసానికి పూనుకున్నారు. 8వేల అడుగుల ఎత్తులో విమానంలోంచి ప్యారాచూట్ లను తీసుకుని కిందికి దూకేశారు. వెంటనే ప్యారాచూట్ తెరచుకోవాలి. కానీ, అవి మొరాయించాయి. విశ్వప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఆలోపే 145 కిలోమీటర్ల వేగంతో దూసుకువచ్చి ఢబేల్ మని కిందపడిపోయారు. 

క్షణాలలోనే వారి ప్రాణాలు గాలిలో కలిసి పోవాలి. కానీ పడ్డది ద్రాక్ష తోటలో. నిక్షేపంగా ద్రాక్షరసంలో తడిసి ముద్దయ్యారు. స్వల్ప గాయలతోనే ప్రాణాలతో బతికిపోయారు. తంతే బూరెల బుట్టలో పడ్డట్టు వీరిని అదృష్టం ద్రాక్ష తోట రూపంలో ఆదుకుంది. విశేషమేమిటంటే, వీరికి ప్యారాచూట్ ఫ్లయింగ్ లో మాంచి అనుభవం ఉంది. 

  • Loading...

More Telugu News