: రైలు చార్జీల పెంపుకు రంగం సిద్ధం


మరికొన్ని రోజుల్లో ప్రయాణీకులపై రైల్వేశాఖ చార్జీల వడ్డన మొదలుపెడుతోంది. చార్జీలు పెంచేందుకు రంగం సిద్ధం చేసిందనీ, త్వరలో వాటిపై ఓ ప్రకటన చేస్తుందనీ ఉన్నత వర్గాల సమాచారం. ఏసీ త్రీ టైర్, చైర్ కార్ మరియు స్లీపర్ క్లాస్ చార్జీలను పెంచి, మరింత ఆదాయాన్ని సమకూర్చుకునేందుకు రైల్వే శాఖ యోచిస్తోంది. ఇందుకు సంబంధించిన నిర్ణయాన్ని రైల్వే మంత్రి పవన్ కుమార్ బన్సల్ ఈనెల జరిగే ’యాన్యువల్ జనరల్ మానేజర్స్‘ సమావేశంలో తీసుకోనున్నారని తెలుస్తోంది. నెల క్రితమే అన్ని వర్గాల చార్జీలను 21 శాతం వరకు పెంచిన కేంద్రం, వాటి ద్వారా రూ.6600 కోట్ల ఆదాయాన్ని పెంచుకున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News