: పెళ్లి అయిందని మర్చిపోయింది.. మళ్లీ పెళ్లి చేశారు!


ఆ ఇద్దరూ ఇటీవలే పెళ్లాడారు. తాజాగా మరోసారి పెళ్లాడారు. ఎందుకూ, అంటే తనకు పెళ్లయిన విషయాన్ని నవ వధువు మర్చిపోయింది. అందుకే మళ్లీ పాత వరుడితోనే కొత్తగా మనువు జరిపించారు. కార్త్, కోడే కార్త్ లకు కొంత కాలం క్రితం వివాహం జరగగా తొలి రాత్రి మర్నాడు.. ఆమె స్పృహ తప్పి పడిపోయింది. ఆస్పత్రిలో చేర్పించగా.. కొన్ని రోజుల తర్వాత స్పృహలోకి వచ్చింది. భర్తను పట్టుకుని ఎవరు మీరని అడిగేసరికి ఆయనకు ఏం పాలుపోలేదు. తమ పెళ్లిరోజు వీడియో, ఫొటోలు అన్నీ చూపించాడు. ప్చ్.. లాభం లేదు. అయినా, నాకు తెలియదనే చెప్పేసింది. దాంతో మరోసారి వారికి వివాహం జరిపించాల్సి వచ్చింది.

  • Loading...

More Telugu News