: బిల్లు విషయంలో బీజేపీ సూచనలను కేంద్రం పట్టించుకోలేదు: వెంకయ్యనాయుడు
రాష్ట్ర విభజన విషయంలో బీజేపీ సూచనలను కేంద్రం పట్టించుకోలేదని ఆ పార్టీ అగ్రనేత వెంకయ్యనాయుడు అన్నారు. పోలవరం ముంపు గ్రామాలను సీమాంధ్రలో కలపడమనే ప్రతిపాదనను మాత్రమే పరిగణనలోకి తీసుకుందని చెప్పారు. ఈ ఉదయం వెంకయ్యనాయుడు నెల్లూరులో మీడియాతో మాట్లాడారు. ఇప్పుడున్న విధంగా విభజన జరిగితే సీమాంధ్రలో ఉద్యోగుల జీతభత్యాలకు సమస్య ఏర్పడుతుందని ఆయన చెప్పారు. బిల్లులోని హామీలన్నింటికి ప్రణాళికా సంఘం అనుమతులు తీసుకోవాలని సూచించారు. తమ సూచనలను పట్టించుకోనందున.. విభజన బిల్లును పార్లమెంటులో పెట్టినప్పుడు తమ నిర్ణయమేంటో చెబుతామని చెప్పారు. తెలంగాణకు కట్టుబడి ఉన్నామని, అదే సమయంలో సీమాంధ్రులకు న్యాయం చేయాల్సిందేనన్నారు. ఆరెస్సెస్ గురించి మాట్లాడే అర్హత రాహుల్ గాంధీకి లేదన్నారు.