: నాదెళ్ల సత్య మైక్రోసాఫ్ట్ సీఈవో కావడంపై మోడీ హర్షం
నాదెళ్ల సత్య మైక్రోసాఫ్ట్ సీఈవోగా ఎంపిక కావడం మంచి పరిణామమని గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ అన్నారు. దేశంలోనూ మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి సంస్థలు ఉద్భవించాలని ఆకాంక్షించారు. చెన్నైలో ఎస్ఆర్ఎం వర్సిటీ 9వ స్నాతకోత్సవంలో మోడీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేశ అభివృద్ధిలో విద్యార్థులు ముఖ్య పాత్ర పోషించాలని ఆకాంక్షించారు. మన దేశంలో విశ్వవిద్యాలయాలు అంతర్జాతీయ ఖ్యాతినార్జించలేకపోవడం దురదృష్టకరమన్నారు. ప్రతీ రాష్ట్రంలోనూ ఐఐటీ, ఐఐఎం, ఎయిమ్స్ తరహా సంస్థలను నెలకొల్పాలనేది తన ఆశయమని చెప్పారు.