: ఈ నెల 12న సీఎం కిరణ్ రాజీనామా?


ముఖ్యమంత్రి కిరణ్ తన పదవికి రాజీనామా చేసి, కొత్త పార్టీ పెడతారా? అనే విషయం మన రాష్ట్రంలోనే కాదు జాతీయ మీడియాలో కూడా ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ అనుమానాలకు ఈ నెల 12న సమాధానాలు లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిన్న చేయి నొప్పితో రోజువారీ కార్యక్రమాలకు దూరంగా ఉన్న ముఖ్యమంత్రిని పలువురు మంత్రులు, నేతలు పరామర్శించారు. ఈ సందర్భంలో వారి మధ్య పలు విషయాలు చర్చకు వచ్చాయి. సీఎం రాజీనామా, కొత్త పార్టీ గురించి కూడా లోతైన చర్చ జరిగింది. వీటికి సమాధానంగా, ఈ నెల 12 టీబిల్లును రాజ్యసభలో ప్రవేశపెడతారని... బిల్లును ప్రవేశపెట్టిన వెంటనే రాజీనామా చేస్తే అన్ని విధాలుగా బాగుంటుందని సీఎం అన్నట్టు విశ్వసనీయ సమాచారం.

  • Loading...

More Telugu News