: డీఎంకే ఎందుకిలాచేసిందో అర్థం కావటంలేదు: చిదంబరం
'శ్రీలంక తమిళుల అంశం మీద డీఎంకే అధినేత కరుణానిధి ప్రధానికి లేఖ రాశారు. దీనిపై ఈనెల 18వ తేదీన సుధీర్ఘంగా చర్చించటం జరిగింది. కాంగ్రెస్ అధినేత్రి సోనియా సైతం కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీతో ప్రత్యేకంగా సమావేశమై శ్రీలంక తమిళుల ఊచకోతను తీవ్రంగా ఖండించారు. అయినా డీఎంకే పార్టీ ఎందుకు మద్దతు ఉపసంహరించుకుందో అర్థం కావటంలేదు' అని కేంద్ర ఆర్థికమంత్రి చిదంబరం అన్నారు.
కొంచెం సేపటిక్రితం ఆయన న్యూఢిల్లీలో ఈ అంశంమీద మీడియాతో మాట్లాడారు. శ్రీలంక తమిళుల అంశంపై పార్లమెంట్ లో తీర్మానం కోసం చర్చలు జరుగుతున్నాయని వెల్లడించారు. తమిళుల మనోభావాలు, ఆగ్రహాన్నీ తీర్మానంలో ప్రతిబంభిస్తామన్నారు. శ్రీలంకలో యుద్ధ నేరాలపై ఐక్యరాజ్యసమితి మానవహక్కుల మండలిలో తీర్మానం కోరతామన్నారు. తమిళుల ఊచకోతపై స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత దర్యాప్తునకు అంతర్జాతీయ సమాజంపై ఒత్తిడి తెస్తామని చిదంబరం చెప్పారు.
కాగా, ఈ మధ్యాహ్నం 12.30 గంటలకు తమ రాజీనామాలు సమర్పించాలని డీఎంకే పార్టీకి చెందిన కేంద్రమంత్రులు నిర్ణయించారు.
కాగా, ఈ మధ్యాహ్నం 12.30 గంటలకు తమ రాజీనామాలు సమర్పించాలని డీఎంకే పార్టీకి చెందిన కేంద్రమంత్రులు నిర్ణయించారు.
- Loading...
More Telugu News
- Loading...