: టెస్ట్ మ్యాచ్ లోనూ ఓటమే


న్యూజిలాండ్ గడ్డపై భారత క్రికెటర్లు అనుభవ పాఠాలు నేర్చినట్లు లేరు. వన్డే సిరీస్ లో అన్ని మ్యాచుల్లోనూ ఓడినట్లే.. టెస్టుల్లోనూ పరాజయ పరంపరను కొనసాగించారు. మొదటి టెస్ట్ మ్యాచ్ లో భారత క్రికెట్ జట్టుపై న్యూజిలాండ్ 40 పరుగుల తేడాతో విజయభేరి మోగించింది. కివీస్ రెండు ఇన్సింగ్స్ లలో కలిపి మొత్తం 608 పరుగులు నమోదు చేయగా.. భారత్ రెండు ఇన్నింగ్స్ లలో కలిపి 568 పరుగులు మాత్రమే చేయగలిగింది. భారత్ రెండో ఇన్సింగ్స్ లో శిఖర్ ధావన్ 117, కోహ్లీ 67, ధోనీ 39 పరుగులు చేశారు. మిగిలిన వారి ఆటతీరు పేలవంగానే సాగింది. రెండు ఇన్నింగ్స్ లలో ఇషాంత్ శర్మ 9 వికెట్లు తీసుకుని మెరుగైన స్థానంలో ఉన్నాడు.

  • Loading...

More Telugu News