: రాష్ట్రపతి చెంతకు తెలంగాణ బిల్లు
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు ఈ రోజు రాష్ట్రపతి ఆమోదం కోసం వెళుతోంది. కేంద్రమంత్రివర్గం ఆమోదముద్ర వేసిన బిల్లును ప్రధాని కార్యాలయం రాష్ట్రపతి కార్యాలయానికి పంపించింది. మహారాష్ట్ర పర్యటనలో వున్న రాష్ట్రపతి ఈ రాత్రికి ఢిల్లీ చేరుకుంటారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ తిప్పిపంపిన బిల్లుకు కేంద్ర కేబినేట్ ఆమోదం తెలిపిన నేపథ్యంలో దీనిపై రాష్ట్రపతి ఏ నిర్ణయం తీసుకుంటారన్నది అందరిలోనూ కుతూహలాన్ని కలిగిస్తోంది.