: ఒకే వేదికపై చంద్రబాబు, గల్లా అరుణకుమారి!
తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు నేడు చిత్తూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా జరిగే ఓ కార్యక్రమంలో చంద్రబాబు, రాష్ట్రమంత్రి గల్లా అరుణకుమారి కలసి తొలిసారిగా ఒకే వేదిక పంచుకోనున్నారు. బంగారుపాళ్యంలో జరిగే మాజీ పార్లమెంటు సభ్యుడు దివంగత నేత చెంగల్రాయ నాయుడు విగ్రహావిష్కరణ కార్యక్రమంలో వీరు పాలుపంచుకుంటారు. దీంతో వీరి కలయిక రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. అరుణకుమారి తనయుడు జయదేవ్ తెలుగుదేశం పార్టీలో చేరి, గుంటూరు నుంచి లోక్ సభకు పోటీచేయనున్న నేపథ్యంలో, తల్లి అరుణకుమారి కూడా కాంగ్రెస్ ను వీడి తెలుగుదేశంలో చేరతారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో చిత్తూరు జిల్లాలో రాజకీయ సమీకరణాలు చాలా వేగంగా మారిపోతున్నాయి.